ETV Bharat / state

పర్యావరణ హితం.. ఈ మొక్కజొన్న చొప్ప పెన్నులు - Eco Friendly Pens News today

పర్యావరణ సమస్యలకు చెక్‌ పెట్టడంలో భాగంగా.. వరంగల్‌ గ్రామీణ జిల్లాకు చెందిన ఓ యువకుడు సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. మొక్కజొన్న చొప్ప నుంచి పెన్నులు తయారు చేసి.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. చూడ ముచ్చటగా ఉన్న.. ఈ ఎకో ఫ్రెండ్లీ పెన్నుల వాడకం వల్ల ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుందని అంటున్నాడు ఈ యంగ్ ఇన్నోవేటర్.

ఈ మొక్కజొన్న పొట్టు పెన్నులు పర్యావరణ హితమే..

author img

By

Published : May 11, 2021, 11:55 AM IST

ప్లాస్టిక్‌ విచ్చల విడి వినియోగంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోంది. ఫలితంగా కాలుష్య నియంత్రణకు తన వంతు ప్రయత్నంగా ముప్పారపు రాజు చొప్పబెండు పెన్నుల తయారీకి పూనుకున్నారు.

ఇది వినియోగిస్తే కొంతైనా హితమే..

రాజుది వరంగల్‌ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలం గోపాలపురం. మొక్కజొన్న చొప్పలను సేకరించి వాటిలో రీఫిల్‌లను అమర్చుతూ ఈ పెన్నులకు రూపమిస్తున్నారు. వరంగల్‌ నగరపాలిక కమిషనర్‌ పమేలా సత్పతి.. ఈ పర్యావరణ హిత కలం తయారీ బాగున్నాయంటూ ట్విటర్‌ వేదికగా కితాబిచ్చారు. ప్లాస్టిక్‌ పెన్నులకు బదులు వీటిని వినియోగిస్తే పర్యావరణానికి కొంతైనా మేలు చేసిన వారమవుతామంటారు రాజు.

ఇవీ చూడండి : రుయాను పరిశీలించిన నేవీ డాక్‌ యార్డు బృందం.. ఘటనపై ఆరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.