ETV Bharat / state

వైద్య విద్యలో ఈబీసీ రిజర్వేషన్ కోటా అమలు! - ntr health university

వైద్యవిద్యలో ఈబీసీ రిజర్వేషన్ అమలుతో సీట్లు పెరిగే అవకాశముంటుందని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వైద్య విద్యలో ఈబీసీ రిజర్వేషన్ కోటా అమలు!
author img

By

Published : Apr 23, 2019, 3:46 AM IST

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్ల విధానాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. అందువల్ల వైద్య విద్యా సంస్థల్లో అదనంగా సీట్లు కేటాయించాలని జాతీయ వైద్య మండలి నిర్ణయించింది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.

వైద్య విద్యలో ఈబీసీ రిజర్వేషన్ కోటా అమలు!
పీజీ వైద్య సీట్ల పెంపునకు వీలుగా ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలను... జాతీయ వైద్య మండలి కోరింది. ఇదే విధానాన్ని ఎంబీబీఎస్ కీ వర్తింపచేయాలని యోచిస్తోంది. ఈమేరకు ఎంసీఐతో చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి కాకుండా నేరుగా కళాశాలలకు ఎంసీఐ నుంచి లేఖలు రావటంతో.. కళాశాలల యాజమాన్యాలు స్పష్టత కోరుతున్నాయి. కాలేజీల్లోని పరిస్థితులు, పడకలు, నిధుల కేటాయింపు, ఇతర అంశాలపై అధ్యయనం జరగకుండా ప్రతిపాదనలు ఎలా పంపగలమని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పీజీ వైద్య విద్య సీట్ల పెంపు ప్రతిపాదనలపై తమకు ఎలాంటి సమాచారం లేదని.. వైద్య విద్య సంచాలక కార్యాలయ వర్గాలు వివరించాయి. ఆంధ్ర వైద్య కళాశాలలో 29 విభాగాల్లో 205 సీట్లే ఉన్నాయి. విభాగాల వారీగా అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఈనేపథ్యంలో 10 శాతం రిజర్వేషన్ల విధానాన్ని ఎలా అమలు చేస్తారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈబీసీ కోటాలో మాదిరిగానే ఇతర రిజర్వేషన్ కోటాలోనూ సీట్లు పెరుగుతాయని సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి.

Intro:jk_vja_11_22_munneru_nsp_water_release

Body:మున్నేరు కు నాగార్జునసాగర్ ర్ నీటి విడుదల

Conclusion:సెంటర్ జగ్గయ్యపేట లింగ స్వామి , సాగర్ నీటి విడుదలతో తీరిన సాగు, తాగునీటి కష్టాలు. తెలంగాణ ప్రాంతం నుంచి నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా మున్నేటి వాగు అందివచ్చిన నీటి ద్వారా కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల పరిధిలో వందలాది గ్రామాలకు తాగునీటి సమస్య తీరింది. ఈ రెండు డు నియోజకవర్గాల పరిధిలో ఉన్న మున్నేరు ద్వారా తాగునీటి, సాగునీటి అవసరాలు తీరుస్తోంది, కానీ రెండు నెలల క్రితమే మున్నేరు పూర్తిగా ఎండిపోవడంతో ఆయకట్టులోని బోర్లు బావుల్లో నీటి మట్టం తగ్గిపోయింది. దీనివల్ల 60 గ్రామాలకు తాగునీరు అందించే పథకాలు పూర్తిస్థాయిలో తాగునీటిని సరఫరా చేయలేని పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ఎత్తిపోతల పథకాల కు సాగునీరు అందక చిన్న కమతాల లో కూరగాయలు, వాణిజ్య పంటలు సాగుచేస్తున్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు జలవనరుల శాఖ అధికారులు కలిసి తెలంగాణ అధికారులతో పలుమార్లు చర్చలు జరిపారు. తనకు వెంటనే సాగర్ కాల్వల ద్వారా నీటిని అందించాలని విన్నవించారు. అందుకు ఒప్పుకున్న తెలంగాణ అధికారులు గత వారం రోజులుగా ఖమ్మం పట్టణం లో ఉన్న నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఎస్కేప్ నుంచి మున్నేరు నేరుగా నీటి విడుదల చేశారు. రోజుకు 500 క్యూసెక్కులు నీటిని విడుదల చేయడంతో నీరు తెలంగాణ దాటుకొని ఆంధ్రా లోకి ప్రవేశించాయి. దీనివల్ల జగ్గయ్యపేట వత్సవాయి పెనుగంచిప్రోలు నందిగామ కంచికచెర్ల చందర్లపాడు మండలాలకు తాగు సాగునీరు అందింది. మొన్నటి వరకు ఆగిపోయిన బోర్లు బావుల్లో నీటి మట్టం పెరిగింది దీనివల్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మున్నేరు లోకి వచ్చిన మీరు madugulu. గుంతల్లో నీరు నిలబడటం వల్ల మరో నెలపాటు పశువులకు తాగునీటి సమస్య ఉండబోదని రైతులు చెబుతున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.