తెదేపా హయాంలో.. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు తెచ్చుకున్న అంబుల వైష్ణవి.. తన పుట్టిన రోజును వినూత్నంగా చేసుకుంది. కరోనా కట్టడి విధుల్లో ఉన్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది కాళ్లు కడిగి సన్మానించింది. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరూ సామాజిక దూరం పాటించాలని.. చేతులను పదే పదే శుభ్రం చేసుకోవాలని.. శానిటైజర్లు వినియోగించాలని ఎస్సై మణికుమార్ పిలుపునిచ్చారు. తమకు సంఘీభావం తెలిపిన వైష్ణవిని అభినందించారు.
ఇదీ చదవండి: