ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2018 జీవో నెంబర్ 63 వల్ల ఉద్యోగాలను కోల్పోతున్నామంటూ మహిళ అభ్యర్థులు విజయవాడ ధర్నాచౌక్ లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జీవో వల్ల 20 నుంచి 30 శాతం మంది మహిళలు నష్టపోతున్నామని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. జీవో నెంబర్ 63 ప్రకారం ఓపెన్, జనరల్ కేటగిరీలో ఉద్యోగం పొందినప్పటికీ వారిని ఆయా కులాల కేటగిరీలో ఉద్యోగం పొందినట్లు చూపిస్తున్నారని తెలిపారు. దీనివల్ల ఆయా కులాల కేటగిరీల్లో ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని కులాల్లోని మహిళా అభ్యర్థులు భారీగా ఉద్యోగాలు కోల్పోతున్నారని, ఈ జీవోను గతంలో ఏ పోటీ పరీక్షల్లోనూ అమలు చేయలేదన్నారు. సీఎం జగన్ తక్షణమే జీవోను రద్దు చేసి తమకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు.
ఇది చూడండి: పాఠశాలల్లో ఫీజుల మోతను తగ్గించేందుకు ప్రత్యేక కమిషన్లు