Drainage Water at Anganwadi: కృష్ణా జిల్లా పామర్రులోని బాపూజీపేటలో పూర్వపు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతం పల్లంగా ఉండటంతో ఇళ్ల నుంచి వచ్చిన మురుగు నీరు అంగన్వాడీ కేంద్రం చుట్టూ నిలిచిపోయింది. ఈ నీరు తీవ్రమైన దుర్వాసన రావడంతో పసిపిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. అంగన్వాడీ కేంద్రానికి తమ పిల్లలను పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. అంగన్వాడీకి వస్తున్న 15 మంది పిల్లలలో ఏడుగురు మాత్రమే హాజరవుతున్నారు. మిగిలినవారు అనారోగ్యంతో బాధపడుతున్నారు. బాలింతలు, ప్రజలు సైతం అంగన్వాడీకి రావడానికి ఆలోచిస్తున్నారు. ఈ సమస్యను నాయకుల దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తున్నారు.
మీడియా ముందుకు వస్తే వారికి వచ్చే ప్రభుత్వం పథకాలు నిరాకరిస్తారనే భయంతో మీడియా ముందు రావడానికి కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కారం చేయాలని వాపోతున్నారు.
ఇవీ చదవండి