రాష్ట్రంలోని 560 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని... ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టరు బూసిరెడ్డి నరేంద్రరెడ్డి తెలిపారు. విజయవాడలో అసోయేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన ఆయన... కరోనా బాధితుల కోసం అన్నిచోట్ల పడకలను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఆరోగ్య శ్రీ ద్వారా పూర్తి సేవలు అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. లక్షణాలు లేని వారిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచిస్తూ... వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. అందుబాటులో ఉన్న పడకల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి