ETV Bharat / state

'వదంతులు నమ్మొద్దు... చికెన్ తినొచ్చు'

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ ధాటికి వ్యాపారాలు కుప్పకూలిపోతున్నాయి. మరోపక్క వదంతుల వలన చికెన్ వ్యాపారస్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. మరికొంతమంది తమ వ్యాపారాలను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు విన్నూత్నంగా ఆలోచిస్తున్నారు. అదేెంటో మీరే చూడండి.

'వదంతులను నమ్మోద్దు... చికెన్ తినచ్చు'
'వదంతులను నమ్మోద్దు... చికెన్ తినచ్చు'
author img

By

Published : Mar 17, 2020, 4:59 PM IST

'వదంతులు నమ్మొద్దు... చికెన్ తినొచ్చు'

కరోనా వైరస్ కలకలం నేపథ్యంలో చికెన్ తింటే వైరస్ సోకుతుందన్న పుకార్లతో వ్యాపారస్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ వదంతులను నమ్మొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం మరింత అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని వ్యాపారులు కోరుతున్నారు. మరికొంతమంది తమ వ్యాపారాలను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు విన్నూత్నంగా ఆలోచిస్తున్నారు. పౌల్ట్రీ వ్యాపారులు కోళ్లకు దాణా పెట్టలేక ఒక కోడి కొనుగోలు చేస్తే మరో కోడి ఉచితమంటూ ప్రచారం చేస్తున్నారు.

కృష్ణాజిల్లా గండ్రమ్ గ్రామంలోని ఓ చికెన్‌ సెంటర్ నిర్వాహకులు ఇంటింటికి వెళ్లి కిలో చికెన్​ను ఉచితంగా పంపిణీ చేశారు. మరో వ్యాపారి వండిన చికెన్ కూర, గారెలను గ్రామస్థులకు పంపిణీ చేశాడు. చికెన్, కోడిగుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లేఖను కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం సైతం చికెన్​పై మరింత అవగాహన కల్పించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి

కరోనా ఎఫెక్ట్​: కొక్కొరోకో... 2వేల కోళ్లు ఉచితంగా పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.