ఇసుక కొరతపై.. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో వినూత్న రీతిలో తాపీ కార్మికులు నిరసన తెలిపారు. ఇసుక భోజనాలు చేశారు. పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులను ఇంటికి పిలిచిన తాపీ మేస్త్రీ శ్రీనివాస్... విస్తరిలో ఇసుకను భోజనంలా వడ్డించారు. ప్రభుత్వానికి తమ సమస్యలు తెలియజేసేందుకే ఈ తరహా ప్రయత్నమని వివరించారు. ఇప్పటికైనా ఇబ్బందులు పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండి: