ETV Bharat / state

సీఎం జగన్​తో టాటా అడ్వాన్స్‌డ్‌, ఏరోస్పేస్‌ ప్రతినిధులు భేటీ

Tata advanced systems Representatives: సీఎం జగన్​తో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌, ఏరోస్పేస్‌ డిఫెన్స్‌ ప్రతినిధులు భేటీ అయ్యారు. రక్షణ, వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ పెట్టుబడులపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడి పెడితే, సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయని వారికి సీఎం వెల్లడించారు.

tata
tata
author img

By

Published : Aug 30, 2022, 5:44 PM IST

Tata Aero space Defence Sector: టాటా అడ్వాన్స్​డ్ సిస్టమ్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు శ్రీధర్, టాటా ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ హెడ్‌ మసూద్‌ హుస్సేనీలు సీఎం జగన్‌ను తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. రక్షణ వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాల్లో పెట్టుబడులు, అవకాశాలపై సీఎంతో టాటా సంస్థ ప్రతినిధులు చర్చించారు. రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాలను సీఎం వారికి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధమని జగన్ హామీ ఇచ్చారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సీఎం తెలిపారు.

ఇవి చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.