కేంద్రప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని కృష్ణా జిల్లా నందిగామలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలు పనులు లేక ఇబ్బందులు పడుతుంటే.. వారిపై గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి పన్నుల భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలను, పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: