కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలతో దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదనీ సీపీఎం నేతలు విమర్శించారు. ఇవి ఉపశమన ప్యాకేజీలు కాదు, భారాలు మోపే ప్యాకేజీలని ఆరోపించారు. వీటి ద్వారా సామాన్యులకు ఏమీచేశారో ప్రధాని మోదీ చెప్పాలని ఆ పార్టీనేత బాబూరావు డిమాండ్ చేశారు. వామపక్షాలు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరు సాగిస్తున్నాయి. ఇందుకు నిరసనగా విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ఆందోళనలు నిర్వహించారు.
2020-21 ఆర్థిక సంవత్సవరం 2వ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందని రిజర్వుబ్యాంకు లెక్కలే తెలుపుతున్నాయని గుర్తుచేశారు. ఆర్థిక మాంద్యంలో దేశం కొనసాగుతోందని అధికార వర్గాలు ప్రకటించారన్నారు. ఇందుకు కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేనని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచడం ద్వారా ప్రజలను కేంద్రం వంచించిందన్నారు. రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సహాయం చేయకుండా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నా వైకాపా ఎందుకు నోరుమెదపడం లేదని నిలదీశారు.
ఇవీ చదవండి