విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కార్మిక దినోత్సవాలు జరిగాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని... మోదీ అధికారంలోకి వచ్చాక 44 కార్మిక చట్టాలను రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు ఒకే వేదిక పైకి వచ్చి పోరాటం చేస్తున్నారని అన్నారు. అంబానీ, ఆదానీ ఆస్తులు రెట్టింపు అవుతుంటే.. పేదవాడు మరింత పేదవానిగా మారుతున్నాడని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
పరీక్షలు వాయిదా వేయాలని.... హైకోర్టు న్యాయవాది శ్రవణ్ కుమార్ మౌనదీక్ష