ETV Bharat / state

దాసరి భవన్ వద్ద స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకలు

విజయవాడలో దాసరి భవన్ వద్ద సీపీఐ రామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంబేడ్కర్ రాజ్యాంగానికి పాలకులు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ప్రజస్వామ్యాన్ని కాపాడుకునేందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ కృషి చేస్తోందన్నారు.

cpi ramkrishna
దాసరి భవన్ వద్ద స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకలు
author img

By

Published : Aug 15, 2020, 3:21 PM IST

సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ దాసరి భవన్​ వద్ద 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజలు చాలా బాధల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ.. లౌకికవాదానికి పాతర వేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. మెుట్టమెుదటి ప్రధాని జవహర్​లాల్ నుంచి.. ప్రధాని మోడీ వరకు పబ్లిక్ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ.. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ కృషి చేస్తోందని అన్నారు.

ఇదీ చదవండి: ఎన్టీఆర్ భవన్​లో జెండా ఎగరేసిన వర్లరామయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.