ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీస్ యంత్రాంగాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మాట్లాడినా.. పోస్టులు పెట్టినా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ అనే మహిళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్ట్ పెడితే ఆమెపై కేసేందుకు పెట్టారని ప్రశ్నించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
డాక్టర్ సుధాకర్ ఏం తప్పుచేశారో అర్ధం కావడంలేదని.. మాస్కులు అడిగినందుకు సస్పెండ్ చేయడం దారుణమని విమర్శించారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ వద్దకు వైకాపా నాయకులు వెళ్లొచ్చు కానీ.. ప్రతిపక్ష నేతలు వెళ్లకూడదా అని ప్రశ్నించారు. వైకాపా నేతలు గుంపులుగా తిరుగుతూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారన్నారు. ఈనెల 22న భవన నిర్మాణ కార్మికులు తలపెట్టిన దీక్షకు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు.
ఇవీ చదవండి.. లాక్డౌన్ అడ్డుపెట్టుకుని వైకాపా అవినీతికి పాల్పడింది: చంద్రబాబు