cpi national seceratry narayana: వరద ప్రభావంతో అతలాకుతలమైన తిరుపతిని కేంద్రమే ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. జాతీయ విపత్తుగా ప్రకటించడం వల్ల తిరుపతి అభివృద్దికి నిధులు సమకూరుతాయన్నారు. తిరుపతికి దేశ వ్యాప్తంగా భక్తులు తరలివస్తారని... యుద్ద ప్రాతిపదికన బాగుచేసుకోవడానికి కేంద్రం సహయక చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వరద నష్టానికి మానవ తప్పిదమే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. వరదలకు కారణమైన వారిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: Central Team Tour: వరద ప్రభావిత ప్రాంతాల్లో.. నేటి నుంచి కేంద్ర బృందం పర్యటన