విజయవాడలోని గుణదల మేరీ మాత ఆలయాన్ని నగర పోలీస్ కమిషనర్ ద్వారాకా తిరుమల రావు సందర్శించారు. రేపటి నుంచి మూడు రోజులు మేరీ మాత ఉత్సవాలు జరగనున్నందున భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాల పనితీరు, క్యూలైన్ల ఏర్పాట్లు పరిశీలించారు.
విజయవాడ గుణదల మేరీమాతకు నమస్కరిస్తున్న పోలీస్ కమిషనర్ ద్వారాకా తిరుమల రావు