ETV Bharat / state

ప్రారంభం కాని సీసీఐ కొనుగోలు కేంద్రాలు.. దిక్కుతోచని స్థితిలో రైతులు - కృష్ణా జిల్లా తాజా వార్తలు

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధర లేక, పంటను అమ్ముకోలేక కృష్ణా జిల్లా పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు.

cotton farmers struggle
ప్రారంభం కాని సీసీఐ కొనుగోలు కేంద్రాలు.. దిక్కుతోచని స్థితిలో పత్తి రైతులు
author img

By

Published : Nov 10, 2020, 7:11 PM IST

ఆరుగాలం కష్టపడి, అధిక వర్షాలను అధిగమించి పండించిన పత్తి పంటను అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట చేతికి వచ్చినప్పటికీ గిట్టుబాటు ధర లేక, కొనేవారు లేకపోవడం వల్ల పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ).. కృష్ణా జిల్లాలో నేటి వరకు పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. సీసీఐ ప్రతి ఏడాది ఖరీఫ్ సీజన్​లో జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, కంచికచర్ల, మైలవరం, తిరువూరు, ఏ కొండూరుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేది. ఈ సారి ఇంకా ప్రారంభించలేదు. సీసీఐ మద్దతు ధర క్వింటాకు రూ. 5550 ఉంది.

అయితే బహిరంగ మార్కెట్​లో ప్రస్తుతం ప్రతి పంటకు నాణ్యత లేదని.. కేవలం రూ. మూడు వేల నుంచి నాలుగు వేలకు మాత్రమే బయట వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు. పత్తి తీర్చడానికి క్వింటాకు రూ. రెండు వేల వరకు ఖర్చవుతుంది. పంట విక్రయిస్తే కనీసం కూలీల ఖర్చురాని పరిస్థితి ఉంది. అధిక వర్షాల వల్ల పత్తి పూర్తిగా దెబ్బతినడం వల్ల దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ఎకరానికి రెండు మూడు గంటలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో కొంత మంది రైతులు పంటను తొలగిస్తున్నారు. ఇప్పటికైనా సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

ఈ నెల 16 తర్వాత పత్తి కొనుగోళ్లు ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుత నాణ్యత లేని పంట వస్తుండటం వల్ల సీసీఐ కొనుగోలు చేసేందుకు ముందుకు రావటం లేదు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా నమోదు చేసుకున్న రైతులు పంట కొనుగోలు చేస్తారు. -ఇ రవికుమార్, మార్కెట్ యార్డు​ కార్యదర్శి

ఇదీ చూడండి:

జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించిన మంత్రి వేణుగోపాల కృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.