ETV Bharat / state

కొవిడ్ ఆస్పత్రి మూడో అంతస్తుపై నుంచి దూకి.. కరోనా రోగి ఆత్మహత్య

corona patient suicide
చిన్నఅవుటపల్లిలో కరోనా రోగి ఆత్మహత్య
author img

By

Published : May 25, 2021, 8:01 AM IST

Updated : May 25, 2021, 9:31 AM IST

07:59 May 25

కృష్ణ జిల్లా గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి  పిన్నమనేని సిద్దార్ధ కొవిడ్ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మూడో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఉంగుటూరు మండలం తేలప్రోలు శివారు కొత్తూరుకు చెందిన పోలిబోయిన రోశయ్య(50)గా పోలీసులు గుర్తించారు. 

గ్రామానికి చెందిన రోశయ్య వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 16న కరోనా వైరస్ సోకి పిన్నమనేని ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. అయితే రోశయ్య కొవిడ్​తోపాటు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆస్పత్రిలో చేరి వారం రోజులు దాటినప్పటికి.. కరోనా తగ్గకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై.. మూడో అంతస్తు కిటికీలో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఆత్కూరు ఎస్సై జి.శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఇదీ చదవండి:

వైట్‌, ఎల్లో ఫంగస్‌పైనా అప్రమత్తం కావాలి: సీఎం జగన్

Last Updated : May 25, 2021, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.