జగ్గయ్యపేట పట్టణంలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ నియంత్రణ కోసం తహసీల్దార్ ఆధ్వర్యంలో అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేశారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉండేలా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తహసీల్దార్ రామకృష్ణ తెలిపారు.
అన్ని శాఖల ఉమ్మడి కార్యాచరణతో.. కరపత్రాలతో ప్రచారం, కఠిన నిబంధనలు అమలు చేయటం , ఇంటింటి సర్వే ద్వారా అనుమానిత కేసులను ముందుగా గుర్తించి హౌస్ క్వారంటైన్ లో ఉంచుతామన్నారు. అన్ని పార్టీల నాయకులు పోలీస్, మున్సిపల్, రెవిన్యూ, వైద్య శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
కరోనా బాధితురాలు.. ఆసుపత్రిలో పడకలు లేవని బస్సులో ఇంటికెళ్లింది!