గవర్నర్ బడ్జెట్ ప్రసంగం పై కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ స్పందించారు. రాష్ట్రంలో రైతులు, కార్మికులు కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. వారిని ఆదుకునే చర్యలు గురించి ప్రస్తావించకుండా మూడు రాజధానుల ప్రస్తావన తీసుకురావటం విచారకరమన్నారు.
రాష్ట్ర అభివృద్ధి రాజధాని వికేంద్రీకరణతో కాదని... అభివృద్ది వికేంద్రీకరణతోనే సాధ్యమన్నారు. తాగు, సాగునీటి సమస్యలు , కరోనా నియంత్రణకై చేపట్టాల్సిన చర్యలు బడ్జెట్ ప్రసంగంలో ఏ మాత్రం ప్రస్తావించకపోవటంపై ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలపై ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తుందన్నారు.