ETV Bharat / state

crop canals: ప్రభుత్వ నిర్లక్ష్యంతో.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దారుణంగా మారిన కాల్వల పరిస్థితి... - krishna water flow in ap

Conditions of crop canals in irrigation: ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంట కాలువల పరిస్థితి దారుణంగా ఉంది. కాలువలు బాగు చేయకపోవడంతో కాలువలు గుర్రపు డెక్క, తుటుకాడతో నిండిపోయాయి. రేపు ఖరీఫ్ కు ప్రభుత్వం నీరు విడుదల చేసిన జిల్లా చివరి రైతులకు నీరు అందుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం సాగునీటి కాలువలను యుద్ద ప్రాతిపదికన బాగు చేయాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 7, 2023, 7:32 AM IST

ఉమ్మడి కృష్ణా జిల్లాలో దారుణంగా మారిన కాల్వల పరిస్థితి

Conditions of crop canals in irrigation Krishna district: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అనేక ప్రాంతాలకు సాగు, తాగు నీరందించే విజయవాడలోని... ఏలూరు కాల్వ, బందరు కాల్వ, రైవస్‌ కాల్వలు మురికి కూపాలుగా మారిపోయాయి. నిర్వహణ సరిగాలేక గుర్రపు డెక్క, తూటుకాడతో.. కాల్వలు నిండిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్‌కు ప్రభుత్వం నీరు విడుదల చేసినా... చివరి ఎకరాకు అందుతుందో లేదో అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఖరీఫ్ సీజన్‌కు ప్రకాశం బ్యారేజీ నుంచి సాగునీరు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నేడు ప్రకాశం బ్యారేజీ నుంచి సాగునీటిని విడుదల చేస్తున్నట్టు మంత్రి జోగి రమేష్‌ తెలిపారు. ఐతే పంట కాల్వల దుస్థితి అధ్వానంగా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగేళ్ల నుంచి కాల్వల నిర్వహణ లేక తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వలలో వ్యర్థాలు పేరుకుపోవటంతో వర్షాలు పడినప్పుడు నీరు పొలాల్లోకి వస్తోందని... అడపా దడపా గుర్రపు డెక్కపై రసాయనాలు స్ప్రే చేసినా... ఫలితం దక్కటంలేదని రైతులు అంటున్నారు.

వరద కష్టం... పంటలు నీటిపాలు!
గత సంవత్సరం సాగునీటి విడుదలపై హడావుడి చేసిన ప్రభుత్వం ఈ ఏడాడి వరి నారు మళ్లకు, నాటుకు నీరు ఎప్పుడు విడుదల చేస్తారో ఇంత వరకు వెల్లడించలేదు. కృష్ణ డెల్టాలో ఎక్కవ శాతం కాల్వలపై ఆదారపడి రైతులు సాగు చేస్తుంటారు. మెట్ట భూముల్లో మాత్రం బోర్ల ద్వారా సాగు జరుగుతుంటుంది. విజయవాడలో కృష్ణనది నుంచి మూడు కాల్వాల ద్వారా ఉమ్మడి జిల్లా ప్రజలకు సాగు, తాగు నీరు అందుతోంది. జిల్లాలో ఉన్న కాలువల అధునీకీకరణకు 2011లో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో రూ. 4573 కోట్ల రుపాయలతో శ్రీకారం చూట్టారని రైతు సంఘాల నేతలు తెలిపారు. 2011లో రైవస్ కాలువ పరిష్టతకు ఒక వైపు గోడ నిర్మాణం చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ రైవస్ కాలువ గోడను పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

Canal Works: పూడిపోయిన కాలువలు.. శిథిలావస్థలో షెట్టర్లు.. ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఇదీ..!

గత నాలుగేళ్ల నుంచి రాష్ట్రంలో కాలువల ఆదునీకీకరణ జరగడం లేదని పేర్కొన్నారు. కాలువలు మురికి కుపాలుగా ఉన్నాయని, కృష్ణనది నుంచి విడుదల చేసిన నీరు జిల్లా చివరి ప్రాంతాలకు వెళ్లే సరికి విషంగా మారుతున్నాయని చెప్పారు. విజయవాడ ప్రజలు వాడుతున్న వ్యర్థాలు అన్ని ఆ కాలవ లోకే విడుదల చేస్తున్నారని రైతులు వెల్లడించారు. ఆ నీటినే తాము తాగు, సాగు నీరుగా వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం యుద్ద ప్రతిపదికన కాల్వలను బాగు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సాగునీటి కాల్వల దుస్థితి దారుణంగా మారిందని... ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆధునికీకరణ పనులు జరపాలని రైతులు, రైతు సంఘాల నేతలు వేడుకుంటున్నారు.

జిల్లాలో ఉన్న కాల్వల అధునీకరణకు ప్రభుత్వాలు గాలికొదిలేశాయి. వైకాపా ప్రభుత్వం కాల్వల ఆధునీకరణ, నిర్వహణకు నిధులు విడుదల చేయటంలేదు. కాల్వలలోకి చేరుతున్న వ్యర్థాలతో నీరు విషతుల్యం అవుతుంది. కాల్వలకు నీరు విడుదల చేసినప్పుడు మురుగు మొత్తం దిగువ ప్రాంతాలకు వెళ్తుంది. విజయవాడ ప్రజలు వాడుతున్న వ్యర్థాలు అన్ని ఆ కాలవ లోకే విడుదల చేస్తున్నారు. ఆ నీటినే తాము తాగు, సాగు నీరుగా వినియోగిస్తున్నాము. యేర్నేని నాగేంద్రనాథ్, రైతాంగ సమాఖ్య కన్వీనర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.