ETV Bharat / state

'బ్లాక్ ఫంగస్ బాధితులకు సత్వర మెరుగైన వైద్య సేవలు'

కృష్ణా జిల్లాలో బ్లాక్ ఫంగస్ బాధితులపై ప్రత్యేక దృష్టి సారించామని కలెక్టర్​ నివాస్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్​ దాస్‌కు వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 461 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదుకాగా వారిలో 151 మందికి శస్త్రచికిత్సలు చేయించామని వివరించారు.

author img

By

Published : Jun 16, 2021, 7:54 AM IST

Collector Nivas
కలెక్టర్​ నివాస్

కృష్ణా జిల్లాలో కొవిడ్​తో పాటు బ్లాక్ ఫంగస్ బాధితులపై ప్రత్యేక దృష్టి సారించామని కలెక్టర్​ నివాస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్​ దాస్‌కు వివరించారు. కరోనా నివారణపై సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్, కొవిడ్​ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఛైర్మన్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు నిర్వహించిన సమీక్షలో కలెక్టర్​ పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లాలో నమోదైన కొవిడ్​, బ్లాక్ ఫంగస్ కేసులు, వాటికి అందిస్తున్న వైద్య సేవలపై కలెక్టర్‌ నివాస్ సీఎస్‌కు నివేదించారు.

కొత్తగా 106 కోవిడ్ కేసులు నమోదవ్వగా 140 మంది డిశ్చార్జ్ అయ్యారని కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 11,88,017 మందికి కొవిడ్ టీకాలు వేశామన్నారు. ప్రస్తుతం 44 ఆస్పత్రుల్లో 3,584 బెడ్స్ అందుబాటులో ఉండగా 1,692 మంది చికిత్స పొందుతున్నారన్నారు. జిల్లాలో 16,95,074 మందికి కరోనా పరీక్షలు నిర్వహించాగా పాజిటివ్ రేటు 5.65 శాతం నమోదయ్యిందని చెప్పారు.

ప్రస్తుతం జిల్లాలో 6,251 యాక్టీవ్ కేసులు ఉన్నాయని తెలిపారు. మరణించిన వారి శాతం 1.06 గా ఉందని చెప్పారు. జిల్లాలో 461 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదుకాగా వారిలో 151 మందికి శస్త్రచికిత్సలు చేయించామని వివరించారు. బ్లాక్ ఫంగస్ కేసులకు సత్వర మెరుగైన వైద్యం అందించే విషయంపై వైద్య నిపుణులతో ప్రత్యేకంగా చర్చించామన్నారు.

ఇదీ చదవండి:

మండలి ఛైర్మన్‌గా మోసేను రాజు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.