ETV Bharat / state

కరోనా వ్యాక్సినేషన్​లో పాత్రికేయులకు ప్రాధాన్యం : కలెక్టర్​ ఇంతియాజ్​ - మీడియా డైరీ ఆవిష్కకరణ కృష్ణా కలెక్టర్​

కరోనా వ్యాక్సినేషన్​ ప్రక్రియలో జర్నలిస్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్​ ఇంతియాజ్ చెప్పారు. విజయవాడ ప్రెస్​క్లబ్​లో బుధవారం ఏపీడబ్ల్యుజే కృష్ణా అర్బన్ యూనిట్ ముద్రించిన మీడియా డైరీ-2021 ను ఆయన ఆవిష్కరించారు.

collector
కరోనా వ్యాక్సినేషన్​లో పాత్రికేయులకు ప్రాధాన్యం : కలెక్టర్​ ఇంతియాజ్​
author img

By

Published : Jan 13, 2021, 8:01 PM IST

జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏపీయుడబ్ల్యుజే కృష్ణా అర్బన్ యూనిట్ ముద్రించిన మీడియా డైరీ-2021 ను ఆయన ఆవిష్కరించారు. కరోనా మహమ్మారి నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో జర్నలిస్టుల సహకారం, కృషి అభినందనీయమన్నారు.

ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ఫ్రంట్ లైన్ వారియర్స్ విభాగాల వారికి ఇచ్చే ప్రాధాన్యతల్లో జర్నలిస్టులకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు ద్వారా టీకా అందిస్తామన్నారు. అలాగే అక్రిడేషన్ మంజూరులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగం అరికట్టేందుకు, కాలువల్లో మురుగు, చెత్త తొలగింపుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయన్నారు.

ఇదీ చదవండి: ఫిర్యాదు చేసిన వారిని బెదిరిస్తే ప్రతిష్ట పెరగదు: మాజీ మంత్రి జవహర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.