అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్... మాటతప్పారని అగ్రిగోల్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. బాధితులను కలిసేందుకు కూడా సీఎం అవకాశమివ్వలేదని... మీడియా ద్వారా ఆయనకు అత్యవసర విజ్ఞాపన పత్రం పంపుతున్నామని పేర్కొన్నారు. బుధవారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు సచివాలయాల్లో అర్జీలు ఇచ్చే ఉద్యమం చేపడుతున్నామని తెలిపారు.
ఇవీ చదవండి