నేతలందరూ అఫిడవిట్లో ఆస్తులు వెల్లడిస్తే... వైకాపా అధినేత జగన్ మాత్రం కేసులు వెల్లడిస్తారని... కృష్ణా జిల్లా నాగాయలంకలో నిర్వహించిన రోడ్‌షోలో సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత వేసిన 45 పేజీల అఫిడవిట్లో... 40 పేజీలు నేరచరిత్రే ఉందన్నారు. ఇలాంటి నేరస్థుడు రాష్ట్రానికి అవసరమా అని ప్రజలను ప్రశ్నించారు. ఆంధ్రాకి న్యాయం చేయకుండా అవినీతిపరులకు మోదీ కాపలా కాస్తుంటారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదిలా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్‌లో ఉన్న సంస్థలపై దాడులు చేస్తోందని ఆరోపించారు. ఆత్మాభిమానం, రోషం ఉన్నవాళ్లంతా తెరాస కుట్రలను ఎదిరించాలని సూచించారు.