ETV Bharat / state

CHANDRABABU-SONUSOOD: కొవిడ్‌పై ఐక్యంగా పోరాడదాం - CBN

కరోనా బాధితుల్ని ఆదుకొనే సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు ఐక్య కార్యాచరణతో ముందుకు సాగాలని..తెలుగుదేశం అధినేత చంద్రబాబు, సినీనటుడు సోనూసూద్ నిర్ణయించారు. వివిధ రంగాల ప్రతినిధులతో చంద్రబాబు నిర్వహించిన వర్చువల్‌ భేటీలో పాల్గొన్న సోనూసూద్‌.. నిస్వార్థ సేవ చేసేందుకు స్పందించే ప్రతి ఒక్కరూ.. నిజమైన హీరోలేనని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో మూడో దశ హెచ్చరికలు దృష్ట్యా ప్రభుత్వానికి ముందస్తు సన్నద్ధత అవసరమని చంద్రబాబు స్పష్టం చేశారు.

కొవిడ్‌పై ఐక్యంగా పోరాడదాం
కొవిడ్‌పై ఐక్యంగా పోరాడదాం
author img

By

Published : Jun 12, 2021, 8:38 PM IST

CHANDRABABU,SONUSOOD: కొవిడ్‌పై ఐక్యంగా పోరాడదాం

ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు వివిధ రంగాల ప్రతినిధిలతో.. వర్చువల్ సమావేశం నిర్వహించారు. ప్రకృతి విపత్తుల్లో ఎన్టీఆర్ ట్రస్టు, తెలుగుదేశం సేవా కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేసిన ఆయన.. ప్రతిపక్షంలో ఉన్నా కరోనా విపత్తులోనూ ఆన్‌లైన్‌ టెలీమెడిసిన్ ద్వారా తోచిన సాయం చేస్తున్నట్లు తెలిపారు. సేవ చేసేందుకు ప్రభుత్వానికి ఎన్నో అధికారాలు, వనరులు ఉంటాయి కాబట్టి.. సంక్షోభ సమయంలో ప్రభుత్వాలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కరోనా మూడో వేవ్‌ను దృష్టిలో పెట్టుకొని అందరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నారుల విషయంలో ముందు జాగ్రత్త చర్యలూ పాటించాలని కోరారు. ఫ్రంట్ లైన్ వారియర్లు నిజమైన హీరోలన్న చంద్రబాబు..వారందరికీ సెల్యూట్ చేశారు.

ఎన్నో విపత్తులను చూశానన్న చంద్రబాబు.. కరోనా లాంటి సంక్షోభం చూడటం ఇదే ప్రథమమన్నారు. ఇలాంటి విపత్తు వేళ సోనూసూద్ అందించిన సేవలను చంద్రబాబు ప్రశంసించారు. సేవ చేయటం తన బాధ్యతగా భావించి ముందుకొచ్చారని కొనియాడారు.

తెలుగు రాష్ట్రాలతో తనకు విడదీయరాని అనుబంధం ఏర్పడిందని సోనూసూద్ తెలిపారు. తన ట్రస్టు ద్వారా 18ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పుతున్నానని వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర స్వయంగా చూసిన తనకు.. కొవిడ్​పై పోరాటంలో ఇద్దరి ఆలోచనలు కలవటం ఎంతో సంతోషానిచ్చిందన్నారు.

కరోనా బాధితుల్ని ఆదుకునేందుకు ఐక్య కార్యాచరణతో పనిచేద్దామంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రతిపాదించగా..అందుకు సోనూసూద్ సమ్మతం తెలిపారు.

వైద్య నిపుణులు ఈ సమావేశంలో పాల్గొని.. ముడో దశను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. కరోనా సమయంలో ఎన్టీఆర్ ట్రస్టు అందించిన సాయాన్ని పొందిన బాధితులు అభిప్రాయాలు పంచుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో సేవలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చదవండి

Cheating: బెజవాడలో 'రియల్' మోసం..రూ. 6 కోట్లతో ఉడాయింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.