ETV Bharat / state

మోదీ ఓడితేనే.. దేశానికి విముక్తి: చంద్రబాబు

దేశంలోని ఎన్డీయేతర నేతలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఒక్క భాజపా నేతలపై మాత్రం దాడులు లేవు.. ఎందుకు?.. కుమార స్వామి హెలికాఫ్టర్​లోనూ సోదాలు చేస్తారు. మోదీ పర్యటించిన హెలికాఫ్టర్​లో తనిఖీ చేస్తే అధికారులను సస్పెండ్ చేస్తారు: చంద్రబాబు

author img

By

Published : Apr 19, 2019, 9:17 PM IST

చంద్రబాబు
రాయచూర్​లో చంద్రబాబు ప్రచారం

జాతీయ స్థాయిలో భాజపాయేతర ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కర్నాటకలో తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే రాయచూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్- జేడీఎస్ కూటమి తరఫున చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కాంగ్రెస్ అధ్యక్షుడు పాల్గొన్న సభలో మోదీపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. కర్నాటకలో ఎన్డీయే వ్యతిరేక గాలి వీస్తోందని... ఇందులో భాజపా అభ్యర్థులు అందరూ చిత్తుగా ఓడిపోతారని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. భాజపా ఆర్థిక విధానాలతో దేశం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలో 50 లక్షల ఉద్యోగాలు పోయాయని దుయ్యబట్టారు. జీఎస్​టీతో వ్యాపారులంతా దారుణంగా దెబ్బతిన్నారన్నారు. రఫేల్ డీల్​తో రక్షణ శాఖలోనూ అవినీతికి పాల్పడిన వ్యక్తి మోదీ అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రతిపక్ష నేతలపై ఐటీ దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. తన కంటే గొప్ప నాయకుడు లేరని మోదీ అనుకుంటున్నారని... అది తప్పని రుజువు చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_32_18_vana_viharam_p v raju_av_c4 తూర్పుగోదావరి జిల్లా అన్నవరం౼గొల్లప్రోలు రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి మృతదేహానికి రైల్వే పోలీసులు గుర్తించారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే రైలు నుంచి జారి పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. ప్రమాదం జరిగి 6 రోజులు కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. తుప్పల్లో నుంచి దుర్వాసన రావడంతో గుర్తించారు. మృతదేహం కుళ్లి, ఛిద్రమై గుర్తు పట్టలేని స్థితి లో ఉంది. ఇతను ఎవరు అనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.