జేసీ ప్రభాకర్‌రెడ్డి వద్ద లారీలు కొన్నామని చెప్పమంటూ లారీ యజమానులను వైకాపా ఎంపీ ఎగదోశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. తెలుగుదేశం నాయకులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని అన్నారు.
-
తెలుగుదేశం నాయకులపై ప్రభుత్వం పెడుతున్నవి అక్రమ కేసులని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఇక్కడ లారీ యజమానులు చాలా స్పష్టంగా వేరే వ్యక్తి పేరు చెబుతుంటే, ఒక గౌరవనీయ ఎంపీ స్థానంలో ఉన్నాయన "ప్రభాకర్ రెడ్డి పేరు చెప్పు" అని ఎగదోస్తున్నారు. (1/2)#TDPWithJCFamily pic.twitter.com/G42OmCliGb
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) June 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">తెలుగుదేశం నాయకులపై ప్రభుత్వం పెడుతున్నవి అక్రమ కేసులని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఇక్కడ లారీ యజమానులు చాలా స్పష్టంగా వేరే వ్యక్తి పేరు చెబుతుంటే, ఒక గౌరవనీయ ఎంపీ స్థానంలో ఉన్నాయన "ప్రభాకర్ రెడ్డి పేరు చెప్పు" అని ఎగదోస్తున్నారు. (1/2)#TDPWithJCFamily pic.twitter.com/G42OmCliGb
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) June 17, 2020తెలుగుదేశం నాయకులపై ప్రభుత్వం పెడుతున్నవి అక్రమ కేసులని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఇక్కడ లారీ యజమానులు చాలా స్పష్టంగా వేరే వ్యక్తి పేరు చెబుతుంటే, ఒక గౌరవనీయ ఎంపీ స్థానంలో ఉన్నాయన "ప్రభాకర్ రెడ్డి పేరు చెప్పు" అని ఎగదోస్తున్నారు. (1/2)#TDPWithJCFamily pic.twitter.com/G42OmCliGb
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) June 17, 2020
విలేకరుల సమావేశంలోనే ఇంత కుట్ర చేసిన వాళ్లు, తెరవెనుక ఇంకెన్ని చేస్తున్నారో ప్రజలే ఆలోచించాలని చంద్రబాబు కోరారు. ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగమేనని ధ్వజమెత్తారు. ప్రజలిచ్చిన అధికారాన్ని సొంత కక్ష సాధింపులకు వాడుకోవడం నేరమని హితవు పలికారు. అయ్యన్నపై కేసు వైకాపా కక్ష సాధింపునకు మరో రుజువు అని దుయ్యబట్టారు. బీసీ నాయకత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు వైకాపా కుట్ర పన్నిందని ఆరోపించారు. జగన్‌కు మొదట్నుంచీ బీసీలంటే కక్ష అన్న చంద్రబాబు... బీసీలు తెదేపాకు వెన్నెముకగా ఉన్నందుకే ప్రతీకారం తీర్చుకుంటున్నారని విమర్శించారు. ఈ బరితెగింపునకు ప్రజలే సరైన సమాధానం చెబుతారని.. సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించారు.
ఇదీ చదవండి 'అచ్చెన్నాయుడికి అత్యున్నత వైద్యం అందించాలి'