కరోనా సమస్యల పరిష్కారానికి వైకాపా ప్రభుత్వంపై సమరభేరి మోగించాలని తెదేపా అధినేత చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ కట్టడిలో వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై 175నియోజకవర్గాలలో నేటి నుంచి 6 రోజుల పాటు తెదేపా నేతలు నిరసనలు చేపట్టనున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆందోళన చేపట్టాలని చంద్రబాబు సూచించారు.
కరోనా బాధితులకు అండగా ఉండటంతో పాటు, ఫ్రంట్ లైన్ వారియర్లకు సంఘీభావం తెలిపాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెదేపా డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్న చంద్రబాబు...,ప్రతి పేద కుటుంబానికి రూ.5వేల ఆర్ధిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కరోనా సోకకుండా ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై తెదేపా కరపత్రాలను ప్రచారం చేయనుంది.
ఇదీ చదవండి: నేడే మంత్రివర్గ విస్తరణ... రాజ్భవన్లో ప్రమాణస్వీకారం