ETV Bharat / state

అక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ భేష్: కేంద్రమంత్రి

రాష్ట్రంలో రెండురోజుల పర్యటనలో భాగంగా కేంద్ర మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ నందివాడ మండలం జనార్ధనపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

central minister giriraj singh visit to tha janardhanapuram at krishna district
author img

By

Published : Sep 6, 2019, 7:07 PM IST

జనార్ధనపురంలో పర్యటించిన కేంద్ర మత్స్య శాఖ మంత్రి

ఆక్వా, మత్స్య సంపద వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ భేషుగ్గా ఉందని కేంద్ర మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్ధనపురంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డికి సంబందించిన చేపల చెరువులను పరిశీలించారు. ఫంగస్ చేపల పెంపకం విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఫంగస్ రకం చేపల ధరలు పడిపోవడాన్ని రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆక్వా రైతులు మేత ఖర్చులు తగ్గించుకువడంపై దృష్టి సారించాలని, తక్కువ ఖర్చుతో అన్ని పోషకాలు ఉండే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవలని కేంద్రమంత్రి అన్నారు. పాడి, మత్స్య పరిశ్రమల వైపు యువత మొగ్గు చూపుతున్నందున వారికి వివిధ కేంద్ర పథకాల ద్వారా చేయూత అందించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.

ఇదీచూడండి.'చంద్రబాబుకు పేరు వస్తుందనే.. జగన్​ కక్ష'

Intro:ap_vzm_36_05_teachers_day_avb_vis_ap10085 గురుపూజోత్స వాన్ని వాడ వాడ ఘనంగా నిర్వహించారు

Body:విజయనగరం జిల్లాలో గురుపూజోత్సవం వాడవాడలా నిర్వహించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పార్వతీపురం లోని పాఠశాలలు కళాశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని సందడిగా నిర్వహించారు బాలికలు చీరలు బాలురు పంచలు కట్టి ఉపాధ్యాయ అవతారమెత్తారు గురువులను ఘనంగా సన్మానించారు ఉపాధ్యాయ దినోత్సవ ప్రాధాన్యతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు

Conclusion:పార్వతీపురంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినిల చీరకట్టుతో సందడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురుపూజ వేడుకలు సర్వేపల్లి చిత్రపటానికి పూలమాల వేస్తున్న ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు అధ్యాపకులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.