ETV Bharat / state

కృష్ణాజిల్లాలో ఆరు నిత్యావసర దుకాణాలపై కేసు నమోదు

కృష్ణా జిల్లా నందిగామ, కంచికచర్ల పట్టణాల్లోని పలు నిత్యావసర దుకాణాలపై తూనికలు, కొలతల అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిబంధనలు పాటించని ఆరు దుకాణాలపై కేసు నమోదు చేసినట్లు తూనికలు, కొలతల అధికారి డీసీ హైజక్​ తెలిపారు.

ఆరు నిత్యావసర దుకాణాలపై కేసు నమోదు
ఆరు నిత్యావసర దుకాణాలపై కేసు నమోదు
author img

By

Published : Jun 16, 2020, 7:12 PM IST

కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలో పలు నిత్యావసర దుకాణాలపై తూనికలు, కొలతల అధికారులు ఆకస్మిక తనీఖీలు నిర్వహించారు. 10 దుకాణాల్లో దాడులు చేయగా 4 షాపులపై కేసు నమోదుచేశారు. తూనికలు, కొలతల కాంటాలపై అనుమతి ముద్ర లేకపోవటంతో పాటు నిత్యావసర వస్తువుల మీద తయారీ షాపుల పేర్లు లేకపోవటంపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం కంచికచర్ల పట్టణంలో 6 నిత్యావసర దుకాణాల్లో తనిఖీలు నిర్వహించగా 2 షాపులపై కేసు నమోదుచేసినట్లు తూనికలు, కొలతల అధికారి డీసీ హైజక్​ తెలిపారు. వినియోగదారులకు నాణ్యతతో పాటు కచ్చితమైన తూకంతో సరుకులు ఇవ్వాలని దుకాణ యాజమానులకు సూచించారు. వాటితో పాటు విడిగా నిత్యావసర వస్తువులు ప్యాకింగ్ చేస్తున్నారని.... వాటిపై తప్పనిసరిగా ప్యాకింగ్ ముద్ర, తేదీ ఉండాలని పేర్కొన్నారు. ఈ నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: మీ సేవ విధులు సచివాలయ సిబ్బందికి బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.