కృష్ణా జిల్లా కంచికచర్ల దోనబండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు యూటర్న్ తీసుకుంటున్న టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గొల్లపూడిలోని ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:కారు-ఆటో ఢీ... ఇద్దరు దుర్మరణం