కృష్ణా జిల్లా నందిగామలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఇసుక కొరత సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. పనులు కోల్పోయిన కార్మిక కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నందిగామ ప్రాంతంలో చుట్టూ కృష్ణా నది పరివాహక ప్రాంతం ఉన్న ప్రభుత్వం ఇసుకను అందించలేకపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ రవాణా ద్వారా బయట ప్రాంతాలకు ఇసుక తరలిపోతోందని ఆరోపించారు. తహశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు.
ఇదీ చూడండి: