కృష్ణా పుష్కరాల్లో కూల్చిన 27 ఆలయాలను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ... విజయవాడ శనీశ్వరాలయం వద్ద భాజపా ధర్నాకు దిగింది. ఆందోళనలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర నాయకులు పాల్గొన్నారు. గోశాలలో ఉంచిన దేవుడి విగ్రహాలను నేతలు పరిశీలించారు. రాష్ట్రంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ తీరు ఆందోళనకరంగా ఉందని సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ పరిధిలో అనేక ఆలయాలు జీర్ణావస్థ స్థితిలో ఉన్నాయని అన్నారు. వాటి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దేవాదాయ భూములను ఇళ్ల కోసం.. నిధులను ఇతర కార్యక్రమాల కోసం వాడతారా అని సోమువీర్రాజు నిలదీశారు. మంత్రి వెల్లంపల్లి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రేపు అమరావతిలో జరిగే సభకు మద్దతుగా తమ ప్రతినిధులు పాల్గొంటారని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: చలో సచివాలయం: నేతల ముందస్తు అరెస్టులు