ETV Bharat / state

Sunil Deodhar: 2024లో భాజపాకు అధికారాన్ని కట్టబెట్టే అస్త్రం అదే : సునీల్ దేవధర్ - సునీల్ దేవధర్ వార్తలు

BJP Leader Sunil Deodhar: చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపించి ఒక్క ఛాన్స్ అన్న జగన్​కు బ్రహ్మరథం పడితే.. దాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో సీఎం జగన్ ఉన్నారని భాజపా రాష్ట్ర వ్యవహారాల సహఇంఛార్జ్ సునీల్ దేవధర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించటంలో వైకాపా, తెదేపాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు.

2024లో భాజపాకు అధికారాన్ని కట్టబెట్టే అస్త్రం అదే

author img

By

Published : Dec 26, 2021, 8:28 PM IST

2024లో భాజపాకు అధికారాన్ని కట్టబెట్టే అస్త్రం అదే

BJP Leader Sunil Deodhar: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిపాలన అందించటంలో వైకాపా, తెదేపా పూర్తిగా విఫలమయ్యాయని భాజపా రాష్ట్ర వ్యవహారాల సహఇంఛార్జ్ సునీల్ దేవధర్ ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన ఆయన.. తెదేపా, వైకాపా పాలన వైఫల్యాలపై మండిపడ్డారు.

చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపించి ఒక్క ఛాన్స్ అన్న జగన్​కు బ్రహ్మరథం పడితే.. దాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో జగన్ ఉన్నారన్నారు. సీఎం జగన్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఈ వ్యతిరేకతే 2024 ఎన్నికల్లో భాజపాకు అధికారం ఇవ్వనుందని జోస్యం చెప్పారు. వైకాపా ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఈ నెల 28న విజయవాడలో ప్రజాగ్రహ సభ నిర్వహిస్తున్నామన్నారు. సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి

Sunil Deodhar: అధికారంలోకి వస్తే.. మతమార్పిడికి వ్యతిరేకంగా బిల్లు: సునీల్ దేవధర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.