విజయవాడతో పాటు జిల్లాలోని వీరవల్లి, హైదరాబాద్‌లలో ద్విచక్రవాహనాలను దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు నగర పోలీసులు తెలిపారు. జిల్లాలోని ఉయ్యూరు మండలం మంటాడకు చెందిన సాయిశేఖర్.. గుంటూరు జిల్లా కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రవితేజనాయక్ అనే వ్యక్తికి ఈ వాహనాలు చేరవేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించవచ్చన్న ఉద్దేశంతో సాయిశేఖర్ ఈ దొంగతనాలను మార్గంగా ఎంచుకున్నాడని సీపీ శ్రీనివాసులు తెలిపారు. 29 నేరాలు చేసి జైలుకు వెళ్లాడని, గతేడాది జూలైలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి విడుదలై నేర ప్రవృత్తిని వదలకుండా చోరీలకు పాల్పడుతున్నాడని సీపీ వెల్లడించారు.
ఇదీచదవండి.