ETV Bharat / state

ప్రతిభ ఉంటే... పేదరికం అడ్డుకాదు..!

పేదరికం అతన్ని వెనక్కి నడిపిస్తుంటే... ఆడాలన్న తపన ఉన్నతస్థాయికి తీసుకెళ్లింది. తల్లి టిఫిన్ సెంటర్ నిర్వహకురాలు... తండ్రి బస్సు డ్రైవర్. చాలీచాలని జీతం. ఆ నగదుతో కుటుంబం గడవాలంటేనే కష్టం. ఈ పరిస్థితుల మధ్య ఆటకు వెళ్లాలంటే... అప్పులు చేయాల్సిందే.! అయినా వెనకడుగు వేయకుండా స్పాన్సర్ల సాయంతో కష్టపడి సాధన చేశాడు. బ్యాడ్మింటన్​ రాష్ట్రస్థాయి పోటీల్లో బహుమతులు సాధించాడు. నేర్చుకున్న క్రీడా పాఠశాలలోనే కోచ్​గా ఎదిగి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాడు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన క్రీడాకారుడు గోపీపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

author img

By

Published : Nov 14, 2019, 4:49 PM IST

విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న కోచ్ గోపి
ప్రతిభ ఉంటే... పేదరికం అడ్డుకాదు

ఆటలో నైపుణ్యం ఉన్నా... పోటీలకు వెళ్లాలంటే దారి ఖర్చులకు డబ్బులుండేవి కాదు. దాతల సాయంతో అతను రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లాడు. పోటీల్లో బహుమతులు సాధించాడు. చదవుకున్న పాఠశాలలోనే శిక్షకుడిగా చేరాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన గోపీ... ఏడో తరగతి చదివేటప్పటి నుంచి బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించాడు. ఆటపై మక్కువతో పలు పోటీల్లో బహుమతులు సాధించాడు. ప్రతిభకు పేదరికం అడ్డు కావొద్దని... తనకొచ్చే వేతనంలో కొంత పేద క్రీడాకారుల కోసం ఖర్చు చేస్తున్నాడు.

గోపి అమ్మ టిఫిన్ సెంటర్ నిర్వహకురాలు. రోజుకు రూ.200, తండ్రి డ్రైవర్​గా పనిచేస్తూ నెలకు రూ.6వేలు సంపాదిస్తారు. వీటితో కుటుంబం గడవటం కష్టంగా ఉండేది. ఫలితంగా గోపీకి ఇష్టమైన ఆటలో రాణించడానికి ఆటంకం కలిగింది. అతని పట్టుదల చూసి తల్లిదండ్రులు అప్పు తీసుకరాగా... దాతలు సాయం చేసేవారు. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం బెంగళూరులో డిప్లమా కోర్సు చదివాడు. ఏడాదిన్నర కిందట శాప్​లో తాత్కాలిక శిక్షకుడుగా చేరాడు.

తాను నేర్చుకున్న క్రీడా పాఠశాలలోనే చిన్నారులకు బ్యాడ్మింటన్​లో శిక్షణ ఇస్తున్నాడు. ప్రతిరోజూ సుమారు 30 మంది విద్యార్థులు గోపీ వద్ద సాధన చేస్తున్నారు. వీరిలో ఇద్దరు రాష్ట్రస్థాయి పోటీల్లో బహుమతులు సాధించారు. మరికొంత మంది యూనివర్సిటీ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటారు. గోపీ... పేద క్రీడాకారుల కోసం తన జీతంలో కొంత ఖర్చు చేస్తున్నాడు. తనలా ఎవరూ ఇబ్బందులు పడకూడదని... వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని గోపీ చెబుతున్నాడు.

గోపీ ఎదుగుదల చూస్తుంటే ఆనందంగా ఉంది...
వేసవి సెలవుల్లో తన వద్దకు బ్యాడ్మింటన్ నేర్చుకునేందుకు వచ్చిన ఓ బాలుడు... ఈ రోజు ఎంతోమంది పేద విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం ఆనందంగా ఉందని... గోపీ శ్రేయోభిలాషి సలాం చెప్పారు. జగ్గయ్యపేటలో గోపీ శిక్షకుడిగా ఉండటం వల్ల మంచి క్రీడాకారులు తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశాడు.

దాతలు సాయం చేయాలి...
తనలా చాలామంది క్రీడాకారులు ఆటలో నైపుణ్యం ఉన్నా... ఆర్థికస్తోమత లేక మధ్యలోనే ఆగిపోతున్నారని గోపీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాతలు ముందుకొచ్చి పేద క్రీడాకారులకు సాయం చేయాలని కోరుతున్నాడు.

ఇదీచూడండి.వినూత్న ఆలోచనలతో శభాష్‌ అనిపించుకుంటున్న విద్యార్థులు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.