అమరావతిపై ఆరోపణలు చేస్తున్న తెదేపా నేతలు బహిరంగ చర్చకు వస్తే వాస్తవాలేమిటో తెలుస్తాయని గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. అమరావతిపై చర్చకు తాము సిద్ధమని.. చంద్రబాబు, లోకేశ్ సిద్ధమా అని సవాల్ విసిరారు. అమరావతిలోని 29 గ్రామాల ప్రజల గురించి మాట్లాడే హక్కు తెదేపా నేతలకు, జేఏసీ నేతలకు లేదన్నారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ ఉద్యమాలు ఆపాలని కోరారు.
ఇదీచదవండి.