Auto turned into bullock cart: ఈ ఎడ్ల బండి భలే ఉంది కదూ.. కానీ కాస్త పరీక్షించి చూడండి. అది ఎడ్ల బండి కాదు. ఆటోనే అలా తయారు చేశారు. విజయవాడ నగరానికి చెందిన ఓ వ్యక్తి తన ఆటోను ఎడ్లబండి మాదిరిగా మార్చేసుకున్నారు. ఆటోకు ఎడ్లబండి మాదిరిగా చక్రాలు రూపొందించారు. బొమ్మ కోడెలను.. వాటికి మువ్వల పట్టీలు, తాళ్లు, సిర్రలు, కాడిమాను వంటి వాటిని ఏర్పాటు చేశారు.
బండిపై కూర్చునేందుకు వేదిక, గొడుగు వంటి వాటిని అమర్చారు. ఈ బండిని వివాహాలు, శుభ కార్యక్రమాలకు సంబంధించి ఊరేగింపులకు తీసుకెళ్లి ఉపాధి పొందుతున్నారు. ఈ ఆటోను సులభంగా ఎక్కడికైనా నడుపుకుంటూ తీసుకెళ్తున్నారు. కృష్టా జిల్లలోని భవానీపురం జాతీయ రహదారిపై వెళ్తున్న ఈ ఆటో దృశ్యాన్ని ఈటీవీ భారత్ క్లిక్‌మనిపించింది.
ఇదీ చదవండి: