కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు జడ్పీటీసీ వూట్ల నాగమణి ఇంటిపై దాడి జరిగింది. పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన దివ్వెల హరీష్ కుమార్ అనే వ్యక్తి దాడికి పాల్పడినట్లు.. నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇనుప రాడ్ తో వచ్చి కిటికీ అద్దాలను ధ్వంసం చేసి, భయబ్రాంతులకు గురి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. హరీష్ కుమార్ తో ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయని.. అవి కోర్టులో కేసులు నడుస్తున్నాయని ఆమె చెప్పారు. దాడికి పాల్పడిన హరీష్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:
GUTKA CAUGHT: ధాన్యం బస్తాల మధ్య గుట్కా తరలింపు.. ఇద్దరిపై కేసు నమోదు