ETV Bharat / state

కొవిడ్​పై అపోలో పోరు: చిత్తూరు ఆస్పత్రి 850 పడకలకు పెంపు

author img

By

Published : May 20, 2021, 11:17 PM IST

చిత్తూరు జిల్లాలోని అపోలో ఆస్పత్రి పడకల సామర్థ్యాన్ని 850కి పెంచినట్లు ఆస్పత్రుల జేఎండీ సంగీతా రెడ్డి తెలిపారు. కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో భాగంగానే ఉన్నతీకరించినట్లు పేర్కొన్నారు.

'కొవిడ్​పై అపోలో పోరు : చిత్తూరు ఆస్పత్రిలో 850కి పడకల పెంపు'

చిత్తూరు జిల్లాలోని అపోలో ఆస్పత్రి పడకల సామర్థ్యాన్ని 850కి పెంచినట్లు ఆస్పత్రుల గ్రూపు సంయుక్త సంచాలకులు సంగీతా రెడ్డి తెలిపారు. కొవిడ్ మహమ్మారిపై పోరాడే ప్రయత్నాల్లో భాగంగానే అప్‌గ్రేడ్ చేసినట్లు పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కోవటానికి ఉమ్మడి కృషిలో భాగంగా 380 నుంచి 850 పడకలకు పెంచడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలోని తవనంపల్లె మండలంలో ఉచిత కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేశామన్నారు.

సీఎం జగన్​కు అభినందనలు..

గత ఏప్రిల్ నుంచి సుమారు 1,680 మందికిపైగా కొవిడ్ రోగులకు చికిత్స అందించినట్లు వివరించారు. 3,794 మంది రోగులను పరీక్షించామని స్పష్టం చేశారు. సమీకృత పోరాటం ద్వారా కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్​కు సంగీతా రెడ్డి అభినందనలు తెలియజేశారు.

ఉత్పత్తిని పెంచాలి..

దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ లభ్యతను పెంచే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని ఆమె సూచించారు. ఈ మేరకు దేశీయ ఉత్పత్తిని పెంచడంతో పాటు విదేశాల నుంచి టెండర్ల ద్వారా వ్యాక్సిన్ సేకరణను పెంచాలని కోరారు.

ఆ రెండు ఆస్పత్రులకు టీకా అవకాశం..

కరోనా టీకాలను అందించే క్రమంలో దేశం సవాల్​ను ఎదుర్కొనున్నట్లు చెప్పారు. దేశీయ ఉత్పత్తిని వేగవంతం చేయడం, వ్యాక్సిన్ లభ్యతను మెరుగుపరిచి జిల్లా స్థాయిలోనే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకాలు అందించే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

ఇవీ చూడండి : తెదేపా మాక్ అసెంబ్లీ.. ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.