విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు తలపెట్టిన బంద్‌లో భాగంగా విజయవాడలో ఏపీఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. నష్టాలను సాకుగా చూపి పరిశ్రమను ప్రైవేట్ వారికి కట్టబెట్టాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. స్వల్ప నష్టాలలో ఉన్న కర్మాగారానికి గనులు కేటాయిస్తే లాభాలు వస్తాయని సూచించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇదీచదవండి.