లాక్ డౌన్ కారణంగా అంతా ఇళ్లకే పరిమితమైనందున గృహ విద్యుత్తు వినియోగం పెరిగిందని ఏపీసీపీడీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జె.పద్మజనార్ధనరెడ్డి చెప్పారు. అందువల్లే కొంత ఎక్కువ మొత్తం బిల్లు వస్తోందే తప్ప... ఇందులో ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావులేదని తెలిపారు. ఏప్రిల్ నెల విద్యుత్ రీడింగ్ తీయలేదని... ఫిబ్రవరి నెల బిల్లు మొత్తాన్నే మార్చి నెల బిల్లుగా వసూలు చేశామని చెప్పారు.
మే నెలలో రీడింగ్ తీసేందుకు అవకాశం ఉన్న చోట స్కానర్ యంత్ర సహాయంతో మాత్రమే రీడింగ్ నమోదు, బిల్లు అందజేత జరుగుతోందని స్పష్టం చేశారు. రెండు నెలలు యూనిట్ లను కలిపి ఒకే బిల్లుగా ఇస్తున్నట్టు జరుగుతోన్న ప్రచారం సరికాదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న శ్లాబ్ మొత్తాలనే విద్యుత్తు నియంత్రణ మండలి కొనసాగించాలని పేర్కొందని చెప్పారు.
వినియోగదారులు బిల్లుల విషయంలో ఎలాంటి అనుమానాలున్నా విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ప్రత్యేక కాల్ సెంటర్లను అందుబాటులో ఉంచామని ఈటీవీ భారత్ ముఖాముఖిలో ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: