రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో నిలవడానికి... ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాలే కారణమని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ఆరోపించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలోనే అనేక రైతు వ్యతిరేక విధానాలను అవలంబించిందని మండిపడ్డారు.
రుణమాఫీ కింద 8 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారని ఆక్షేపించారు. పంపుసెట్లకు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్ పధకానికి తూట్లు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. రైతులకు బేడీలు వేయడం, అర్చకులపై దాడి చేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా మంచి పరిపాలన అందించాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: