విజయవాడలోని బసవపున్నయ నగర్లోని ఓ ఇంట్లోకి ఓ యువకుడు చొరబడ్డాడు. అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చిన వ్యక్తిని పట్టుకున్న స్థానికులు... అజిత్ సింగ్నగర్లోని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... అతన్ని ఠాణాలోనే ఉంచారు. తెల్లారేసరికి ఆ యువకుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై విజయవాడ సీపీ ద్వారక తిరుమలరావు విచారణకు ఆదేశించారు. శాఖాపరమైన విచారణ పూర్తయింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లలను సస్పెండ్ చేస్తూ విజయవాడ సీపీ ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చదవండి