ETV Bharat / state

స్థానికంపై సమరం...కొత్త నోటిఫికేషన్​కు విపక్షాలు పట్టు

author img

By

Published : Oct 28, 2020, 7:47 PM IST

Updated : Oct 29, 2020, 5:56 AM IST

స్థానిక సంస్థల ఎన్నికలకు విపక్షాలన్నీ సై అంటుంటే ప్రభుత్వం, వైకాపా మాత్రం నై అంటున్నాయి. కరోనా మళ్లీ పెరగొచ్చని, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సుముఖంగా లేదని ప్రభుత్వం స్పష్టం చేయగా ఇతర రాష్ట్రాల‌్లో పోలింగ్‌, ఏపీలో పరిస్థితిని అంచనా వేసి తుది నిర్ణయం తీసుకోవాలని విపక్షాలు కోరాయి. ఏకగ్రీవాలన్నీ రద్దుచేసి.. కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. అన్నీ పరిశీలించాకే... ఓ నిర్ణయానికి వస్తామని ఎస్​ఈసీ స్పష్టం చేసింది

SEC Nimmagadda Ramesh Kumar
SEC Nimmagadda Ramesh Kumar

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం మళ్లీ రాజకీయాలను వేడెక్కించింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ అంశంపై వాడివేడి విమర్శలు మొదలయ్యాయి. ఈ ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 11 పార్టీలతో విడివిడిగా సమావేశమయ్యారు. పాత నోటిఫికేషన్‌ను, ఏకగ్రీవాలనూ పూర్తిగా రద్దుచేసి మళ్లీ మొదట్నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని 9 పార్టీలు కోరగా, రెండు మాత్రం ప్రభుత్వాన్ని సంప్రదించాలని, టీకా వచ్చిన తర్వాతే ఎన్నికలు పెట్టాలని అన్నాయి. ఈ సమావేశానికి దూరంగా ఉన్న వైకాపా నేతలు విడిగా మీడియాతో మాట్లాడుతూ.. మూడు నాలుగు కేసులు ఉన్నప్పుడే ఎన్నికలను రద్దుచేశారని, ఇప్పుడు రోజుకు మూడువేల కేసులు వస్తుంటే ఎన్నికలు ఎలా పెడతారని ప్రశ్నించారు. సాయంత్రం రమేశ్‌ కుమార్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సమావేశమైనప్పుడు కూడా.. కరోనా సెకండ్‌వేవ్‌ వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సుముఖంగా లేమన్నారు. ఎన్నికలు జరగాల్సిందేనని, అయితే తాము కూడా ఇప్పటికిప్పుడే నిర్వహించాలని అనుకోవడం లేదని ఎస్‌ఈసీ అన్నట్లు తెలుస్తోంది.

కొత్తగా మళ్లీ నిర్వహించండి

మరోవైపు.. పాత నోటిఫికేషన్‌ రద్దుచేసి పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికలు మరోసారి నిర్వహించాలని పలు పార్టీలు ఎస్‌ఈసీని కోరాయి. గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దుచేసి కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలన్నాయి. అభిప్రాయ సేకరణకు హాజరైన వారిలో ఒక్కో పార్టీ ప్రతినిధికి ఎస్‌ఈసీ 10-15 నిమిషాలు కేటాయించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇది కొనసాగింది. ముందుజాగ్రత్తగా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.

వైకాపా, మరికొన్ని పార్టీల గైర్హాజరు
ఎన్నికల కమిషనర్‌ అభిప్రాయ సేకరణకు ముందు ప్రకటించినట్లుగానే అధికార వైకాపా తరఫున ఎవరూ హాజరు కాలేదు. ఎన్‌సీపీ, తెరాస, ఆర్‌ఎల్డీ, ఆర్‌ఎస్పీ, ఎంఐఎం హాజరుకాలేదని ఎన్నికల సంఘం తెలిపింది.

కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలి: అచ్చెన్నాయుడు, తెదేపా

‘స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్తగా మళ్లీ నోటిఫికేషన్‌ జారీచేయాలి. పంచాయతీ చట్టంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కి కాలం చెల్లినందున ఎన్నికలతోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలూ రద్దుచేయాలి. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నామినేషన్లు వేసేలా ఏర్పాట్లు చేయాలి. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తెదేపా సిద్ధమే. స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన ఎన్నికల సంఘాన్ని నియంత్రించేలా ప్రభుత్వం ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కమిషనర్‌కి మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలు పెట్టాలన్న ప్రభుత్వం, తగ్గుముఖం పట్టాక వద్దనడం విచిత్రం. ప్రస్తుత సమయంలో ఎన్నికలకు వెళ్తే ప్రజలు బుద్ధి చెబుతారన్న భయంతో ప్రభుత్వం అడ్డుకుంటోంది.’

నోటిఫికేషన్‌ రద్దు చేయాలి: పాకా సత్యనారాయణ, భాజపా

‘స్థానికసంస్థల ఎన్నికలకు ఇదివరకు జారీచేసిన నోటిఫికేషన్‌ రద్దుచేసి కొత్తగా మరో నోటిఫికేషన్‌ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాల్ని రద్దు చేయాలి. గతంలో వీటిపై ఫిర్యాదు చేసినా మీరు పట్టించుకోలేదు. ఈసారి ఎన్నికలు నిష్పక్షపాతంగా, నిజాయతీగా నిర్వహించి ప్రజలు నిర్భయంగా ఓటు వేసే పరిస్థితి కల్పించాలి. గతంలో సకాలంలో ఎన్నికలు నిర్వహించని తెదేపా, ఎన్నికలను అడ్డుకుంటున్న వైకాపా స్థానిక ఎన్నికలపై మాట్లాడే హక్కును కోల్పోయాయి.’

ఎన్నికల్లో అవకతవకలపై విచారణ చేపట్టాలి: మహేందర్‌రెడ్డి, జనసేన

‘మార్చిలో నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా అధికార పార్టీ చేసిన అవకతవకలు, హింసపై విచారణ చేపట్టాలి. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలి. ఎన్నికల ప్రక్రియలో జనసేన భాగస్వామ్యమవుతుంది’.

పాత ప్రక్రియను రద్దుచేయాలి: రామకృష్ణ, సీపీఐ

‘రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన స్థానికసంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దుచేసి కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలి. గతంలో జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేసి, సమగ్ర విచారణ చేయించాలి. స్వేచ్ఛగా పోటీ చేసేందుకు, ఓట్లు అడిగేందుకు అవకాశం, భద్రత కల్పించాలి. వైద్య నిపుణుల సలహాలు తీసుకొని ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ ఎన్నికల నిర్వహణపై తగు నిర్ణయం తీసుకోవాలి.’

ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలి: వెంకటేశ్వరరావు, సీపీఎం

‘కరోనా వైరస్‌ ప్రభావం, అధిక వర్షాలు, వ్యవసాయ పనులు, విద్యాసంస్థల పునఃప్రారంభం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ప్రకటించాలి. కరోనా కారణంగా ఇప్పటికే ఒకసారి వాయిదా పడినందున ఇప్పటికైనా సరైన అంచనాకు వచ్చి వివాదాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి.’

కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాతే: మస్తాన్‌ వలీ, కాంగ్రెస్‌

‘పాత నోటిఫికేషన్‌ రద్దుచేసి రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించాలి. బలవంతపు ఏకగ్రీవాల్ని రద్దుచేసి వీటిపై విచారణ చేయించాలి. కరోనా నేపథ్యంలో పూర్తి భద్రత వచ్చేవరకూ ఏ ఎన్నికలూ నిర్వహించరాదు.’
ఇంకా.. జేడీ(యూ) తరఫున సాంబశివరావు, ముస్లింలీగ్‌ నుంచి బషీర్‌ అహ్మద్‌, సమాజ్‌వాదీ పార్టీ నుంచి వినయ్‌ పురుష్‌ యాదవ్‌, అన్నాడీఎంకే ప్రతినిధి ఆంబ్రోస్‌ విల్సన్‌, ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి సుందర రామరాజు తదితరులు కూడా పాల్గొని.. తమ అభిప్రాయాలు తెలిపారు. వీరిలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ మాత్రం టీకా వచ్చేవరకు ఆగాలని తెలిపింది.

వైకాపా ఆరోపణల్లో నిజం లేదు: ఎస్‌ఈసీ

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులను సంప్రదించడం లేదన్న వైకాపా ఆరోపణల్లో వాస్తవం లేదని రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. కరోనా పరిస్థితిపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్‌, కమిషనర్‌ భాస్కర్‌తో మంగళవారం సమావేశమై చర్చించినట్లు తెలిపారు. ఎన్నికలపై వైకాపా నేతల ప్రకటన ఆశ్చర్యం కలిగించిందని, నిర్వహణపై హైకోర్టుకు నిర్ణయం తెలియజేయాల్సి ఉందని, అన్ని పార్టీల సమావేశానికి వైకాపా హాజరుకాకపోగా ఆరోపణలు చేయడం విచారకరమని ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.

అజాగ్రత్తగా ఉండలేం: సీఎస్‌

రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి కొంత తగ్గినా.. మళ్లీ ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సుముఖంగా లేమని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌తో సమావేశమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు సీఎస్‌ ఓ నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజుకు పదివేల నుంచి మూడు వేలకు తగ్గినా.. అజాగ్రత్తగా ఉండలేమని, ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేమని ఆమె స్పష్టం చేసినట్లు తెలిసింది. కరోనా కుదుటపడ్డాక ఎన్నికల నిర్వహణ కోసం కమిషన్‌ను సంప్రదిస్తామని పేర్కొన్నట్టు సమాచారం. కరోనా బారిన పడిన ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను శాఖలవారీగా చెబుతూ.. పోలీసుశాఖలోనే కొన్ని వేలమందికి సోకిందని వివరించినట్లు సమాచారం. దీనిపై రమేశ్‌ కుమార్‌ స్పందిస్తూ ఎన్నికలు ఆపలేమని, జరగాల్సిందేనని.. అయితే తాము కూడా ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరపాలనుకోవడం లేదని, తొందరపడి నిర్ణయాలు తీసుకోబోమని చెప్పినట్టు సమాచారం. కరోనాపై అధికారులతో మాట్లాడుతున్నామని, తగు సమయంలో ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసినట్లు తెలిసింది.

ఇదీ చదవండి

వైకాపా ఆరోపణలు ఆశ్చర్యం కలిగించాయి: నిమ్మగడ్డ

Last Updated : Oct 29, 2020, 5:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.