గన్నవరం విమానాశ్రయంలో తెదేపా అధినేత చంద్రబాబును సాగు నీటి సంఘాల సమాఖ్య నేతలు కలిశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్‌లు అడ్డుకునేందుకు కృషి చేయాలని కోరుతూ సాగు నీటి సంఘాల సమాఖ్య.. రాష్ట్ర నేత ఆళ్ళ వెంకట గోపాల కృష్ణా రావు చంద్రబాబుకు వినతి పత్రం అందించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ అంశాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్, కేంద్ర జలశక్తి శాఖకార్యదర్శి దృష్టికి తీసుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్‌కు నివాళులు అర్పించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు శ్రీకాళహస్తి వెళ్లారు. మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం తిరుపతి నుంచి విమానంలో గన్నవరం చేరుకున్నారు. తిరుపతి నుంచి అమరావతి చేరుకున్న తెదేపా అధినేత చంద్రబాబును గన్నవరం విమానాశ్రయం వద్ద సాగు నీటి సంఘాల సమాఖ్య నేతలు కలిశారు.
ఇదీ చదవండి: