ప్రపంచ ముందు బలమైన ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలిచింది అంటే అందుకు డాక్టరు బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంబేడ్కర్ 130వ జయంతి వేడుకలను రాష్ట్రస్థాయి ఉత్సవంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ప్రతి భారతీయుడు... రాజ్యాంగ రచనలో అంబేడ్కర్ చేసిన కృషిని... బడుగు బలహీన నిమ్న వర్గాలకు సమాన అవకాశాల కల్పన కోసం తపించిన విధానాన్ని తప్పనిసరిగా స్మరించుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.సునీత చెప్పారు. సాంఘిక సంక్షేమశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.సునీత, గిరిజన సంక్షేమశాఖ ప్రభుత్వ కార్యదర్శి కాంతిలాల్ దండే, ప్రభుత్వ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, సాంఘిక సంక్షేమశాఖ సంచాలకులు ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గుడివాడ నియోజకవర్గంలో అంబేడ్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుల సంఘాలు, వైకాపా కార్యాలయం, ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్, ప్రభుత్వం కార్యాలయాల్లో నిర్వహించారు. నాగవరప్పాడులోని బాబాసాహెబ్ విగ్రహానికి అడిషనల్ ఎస్. పి మల్లికా గార్గ్ పూల మాల వేసి నివాళులు అర్పించారు.
బలుసుపాడు గ్రామంలో బాబాసాహెబ్ అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ చేశారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను కుమారుడు సామినేని ప్రసాద్ బాబు, అక్షర ఫౌండేషన్ ప్రతినిధి చైతన్య చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేపట్టారు. మహనీయుల విగ్రహాలకు పూలమాలలతో నివాళులు అర్పించారు. తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయవాది చక్రవర్తి, బీసీ నేతలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: