ETV Bharat / state

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి

author img

By

Published : Feb 25, 2021, 4:11 PM IST

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అమ్మవారి పెద్ద తిరునాళ్లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు వైభవంగా సాగే ఈ తిరునాళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా భక్తులు తరలిరానున్నారు.

sri thirupathamma thirunallu
శ్రీ తిరుపతమ్మ అమ్మవారు

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 5 రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే తిరునాళ్లకు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలిరానున్నారు. తిరునాళ్లు తొలిరోజు శుక్రవారం సాయంత్రం 9 గంటలకు శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. మరుసటి రోజు శనివారం జల బిందెల ఉత్సవం జరగనుంది. ఆది, సోమ వారాల్లో గ్రామదేవతల ఉత్సవాలు నిర్వహించనున్నారు.

పెద్ద తిరునాళ్ల కోసం దేవస్థానం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. తొలి రోజున తరలివచ్చే దీక్ష స్వాములు, భక్తులకు భారీ అన్న సమారాధన చేయనున్నారు. ఆలయం వద్ద కల్యాణాన్ని వీక్షించేందుకు 10 డిజిటల్ తెరలను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం లడ్డూ, ప్రసాదాలతో పాటు.. అవసరమైన తాగునీరు, వసతి, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలను పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి మూర్తి తెలిపారు. తిరునాళ్ల ఏర్పాట్లను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పరిశీలించారు.

ఇదీ చదవండి:

ఆన్​లైన్​లో మార్చి నెల తిరుమల శ్రీవారి వర్చువల్ సేవా టిక్కెట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.