ETV Bharat / state

MURDER CASE: అందుకోసమే చంపానన్న నిందితుడు ఏడుకొండలు - crime news

కృష్ణా జిల్లా అగినపర్రులో కలకలం రేపిన దేవరకొండ నాంచారయ్య దారుణ హత్య కేసులో కుటుంబ కలహాలే కారణమని అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ భాషా తెలిపారు. తొలుత నిందితుడు ఏడుకొండలు స్వయంగా తానే హత్య చేసినట్లు లొంగిపోయినప్పటికీ.. కేఈబీ కాలువలో మృతదేహం దొరికాక పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత నిందితుడు తాగిన మత్తులో మాట్లాడుతున్నాడని భావించిన పోలీసులు ప్రాథమిక విచారణలో హతుడు కనిపించకపోవడంతో గాలింపు ముమ్మరం చేశారు.

MURDER CASE
MURDER CASE
author img

By

Published : Aug 17, 2021, 8:13 PM IST

కుటుంబ కలహాల నేపథ్యంలోనే పమిడిముక్కల మండలం, అగినపర్రుకు చెందిన మటన్ వ్యాపారి దేవరకొండ నాంచారయ్య దారుణ హత్య జరిగిందని కృష్ణా జిల్లా అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ భాషా తెలిపారు. అగినపర్రుకు చెందిన మటన్ వ్యాపారులు నాంచారయ్య, గరికే ఏడు కొండలుకు మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయని.. నిందితుని కుమార్తెకు నాంచారయ్య సోదరుని కుమారుడితో వివాహం చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత వివాహాన్ని రద్దు చేసుకుందామని ఆలోచించుకున్నారు. నాంచారయ్యతో ఇబ్బందులు పోవాలంటే అతనిని అడ్డుతొలగిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావించిన ఏడుకొండలు.. అతని కుటుంబసభ్యులతో కలిసి హత్యకు పథకరచన చేశారని డీఎస్పీ పేర్కొన్నారు. 14న ఏడుకొండలు అతని కుటుంబ సభ్యులు నాంచారయ్యను వారి మోటార్ సైకిల్ పై ఎక్కించుకుని అగినపర్రు దాటిన తర్వాత మందు తాగించి నిమ్మగడ్డ సమీపంలో హతమార్చి కాల్వలోకి తోసేసి వెళ్లిపోయినట్లు వివరించారు.

16న నిమ్మగడ్డ వీఆర్ఓ వద్ద ఏడుకొండలు లొంగిపోయాడని తెలిపారు. మృతదేహాన్ని గుర్తించిన అనంతరం హత్య కేసుగా ఆల్టర్ చేసి నిందితుడు ఏడుకొండలును అరెస్టు చేశామన్నారు. హత్యలో కుటుంబసభ్యుల పాత్రపై దర్యాప్తు చేసామనీ.. వారిని త్వరలో అరెస్టు చేయనున్నట్లు వెల్లడించారు. మేజిస్ట్రేట్ ఎదుట ఈరోజు హాజరు పరచనున్నట్లు తెలిపారు.

అసలేం జరిగిందంటే..

కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం నిమ్మగడ్డ - వెలివోలు గ్రామాల మధ్యలో కృష్ణానది ఎడమ కరకట్ట కేఈబీ కాలువలో రెండు మూటలలో మృతదేహం కలకలం రేపింది. కాలువలో మూటలున్నాయని చల్లపల్లి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. మూటలను విప్పి చూడగా అందులో మృతదేహం రెండు భాగాలుగా కనిపించిందని పోలీసులు తెలిపారు. కాగా అంతకుముందు అగినపర్రు గ్రామానికి చెందిన దేవరకొండ నాంచారయ్య అనే వ్యక్తిని చంపి ఆ కాలువలో పడవేసినట్లు కూచిపూడి పోలీస్​ స్టేషన్​లో గరికే ఏడుకొండలు అనే వ్యక్తి లొంగిపోయాడు. పోలీసులు ఆ కోణంలో విచారిస్తూ నాంచారయ్య కుటుంబ సభ్యులను నిమ్మగడ్డ లాకుల వద్దకు తీసుకొచ్చారు. ఆ శవం నాంచారయ్యదేనని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఏడుకొండలు కుమారుడు నాగరాజు ఈ హత్యలో పాలుపంచుకున్నాడని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: కిరాతకంగా నరికి.. రెండు భాగాలు చేసి కేఈబీ కెనాల్​లో విసిరేశారు..

లొంగిపోయిన ఏడుకొండలు..

కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం అగినపర్రు గ్రామానికి చెందిన గరికే ఏడుకొండలు అనే వ్యక్తి పోలీసులను ఒక్కసారిగా ఖంగుతిలేలా చేశాడు. నిన్న మధ్యాహ్నం చల్లపల్లి మండలం నిమ్మగడ్డ లాకుల దగ్గర దేవరకొండ నాంచారయ్య అనే వ్యక్తిని తాను హత్య చేశానని.. శవాన్ని కేఈబీ కాలువలో పడేశానని.. కూచిపూడి పోలీసు స్టేషన్​కు వెళ్లి చెప్పాడు. ఇది విని ఉలిక్కిపడ్డ పోలీసులు అతడిని తీసుకుని ఘటనాస్థలికి వెళ్లారు. స్థానికులను విచారణ చేశారు. కాలువ చుట్టూ గ్రామాల్లో ఏదైనా మృతదేహం కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని మహిళా పోలీసులను చల్లపల్లి సీఐ శ్రీనివాస్​ ఆదేశించారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు స్టేషన్ల పోలీసులకూ సమాచారం అందించారు.

ఇదీ చదవండి: MYSTERY: ఏడుకొండలు చెప్పేది నిజమేనా.. షాకైన పోలీసులు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.